Insta TV యాప్‌ను విడుదల చేసిన మెటా
- December 17, 2025
ఇకపై మొబైల్ ఫోన్లలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ కళ్లకు ఇబ్బంది పడాల్సిన అవసరం తగ్గనుంది. ఇన్స్టాగ్రామ్ తాజాగా Insta TV యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా టీవీ స్క్రీన్‌పైనే రీల్స్, షార్ట్ వీడియోలను సులభంగా వీక్షించవచ్చు.
ప్రస్తుతం ఈ యాప్‌ను అమెరికాలోని ఎంపిక చేసిన అమెజాన్ ఫైర్ టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌పై ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారుల స్పందనను బట్టి త్వరలోనే ఇతర స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫార్మ్స్‌కు కూడా విస్తరించనున్నట్లు తెలుస్తోంది.
టీవీల్లో డిజిటల్ కంటెంట్, సోషల్ మీడియా వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెటా వెల్లడించింది.పెద్ద స్క్రీన్ పై కంటెంట్ చూడాలనే వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని Insta TV యాప్‌ను రూపొందించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు







