ఇమ్మానుయేల్ జర్నీ వీడియో ప్రోమో విడుదల
- December 17, 2025
మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 పూర్తికానుంది. సీజన్ 9 ఎవరు విన్నర్ అవుతారు అని ప్రేక్షుకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో తనూజ, కళ్యాణ్ అభిమానులు పోటీపడి పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఓటింగ్ లోనూ ఈ ఇద్దరే టాప్ లో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ అవ్వనున్నారు. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 మెంబర్స్ ఉన్నారు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన, డీమన్ పవన్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఒకరు విన్నర్ అవ్వనున్నారు. కాగా ప్రస్తుతం చివరివారం ఓటింగ్ జరుగుతుంది.ఈవారం ఓటింగ్ లో కళ్యాణ్ తనూజ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నారు. కాగా ఆతర్వాత ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ కొనసాగుతున్నారు.
మొదటిగా బిగ్ బాస్ సీజన్ 9 ఎంటర్‌టైనర్ ఆఫ్ ది హౌస్ ఇమ్మానుయేల్‌కి సంబంధించిన జర్నీ వీడియోకి సంబంధించిన ప్రోమో వచ్చింది.బిగ్ బాస్ హౌస్‌లో ఇమ్మానుయేల్ ఈ 100 రోజుల ప్రయాణంలో ప్రతి మూమెంట్‌ని గుర్తు చేశారు బిగ్ బాస్. తన తల్లి హౌస్‌లోకి వచ్చినప్పటి ఫొటో చూసి ఎమోషనల్ అయ్యాడు ఇమ్మానుయేల్. ఇక ఫైనలిస్ట్‌ల గురించి బిగ్ బాస్ మాట్లాడే మాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండగా..ఇమ్మానుయేల్ గుండెల్ని తాకే మాటలు మాట్లాడారు బిగ్ బాస్.
అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది. చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించిన వాళ్లకే ఓ చిన్న చిరునవ్వు బలమెంతో తెలుస్తోంది. ఈ ఇంట్లో అదే మీ బలంగా ముందుకు సాగారు. అదే నవ్వును పంచుతూ అందరితో కలిసిపోయారు. నవ్వులైనా నామినేషన్ అయినా.. మాటలే మీ ఆయుధాలు.. తెలివితేటలే మీగేమ్ ప్లాన్. ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్‌టైన్ చేయాలనే విషయం ఈ ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు.
అసలు ఈ సీజన్‌లో ఇమ్మానుయేల్ లేకపోతే అసలు ఊహించుకోవడమే కష్టం అనేట్టుగా అద్దరగొట్టాడు. జబర్దస్త్ కమెడియన్లు ఇప్పటివరకూ చాలామంది బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారు వెళ్లారు కానీ.. ఇమ్మానుయేల్ చేసినంత ఎంటర్టైన్మెంట్ ఎవరూ చేయలేదు. కేవలం జనాల్ని నవ్వించడం మాత్రమే కాదు.. టాస్క్‌లలో కూడా ఇరగదీశాడు. ఏ టాస్క్ ఇచ్చినా కూడా గెలుపు నాదే అన్నంత కసిగా ఆడాడు ఇమ్మానుయేల్. సిచ్యువేషన్ ఏదైనా సరే.. అక్కడ తన మార్క్ ఉండేట్టుగా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవాడు.
నిజానికి కామెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు. జోక్ వేశామంటే అవతల వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారానే అనే భయం ఉంటుంది. ఒక్కొక్కరు నవ్వుతారు.. కొంతమంది సీరియస్ అవుతారు. బిగ్ బాస్ సీజన్ 9 ఎంటర్‌టైనర్ ఆఫ్ ది హౌస్‌గా నిలిచాడు ఇమ్మానుయేల్. బిగ్ బాస్ టైటిల్ ఎవరిది అంటే.. అయితే కళ్యాణ్, లేదంటే తనూజ అంటున్నారు కానీ.. నిజమైన విన్నర్ అంటే మాత్రం అది ఇమ్మానుయేలే. బట్ కమెడియన్‌ని కమెడియన్‌లాగే చూస్తారు కాబట్టి.. విన్నర్లు కాలేదు. ఇప్పుడు ఇమ్మానుయేల్ విషయంలో అదే అయ్యింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







