ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల

- December 17, 2025 , by Maagulf
ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల

అమరావతి: ఏపీ సీఆర్డీఏ(CRDA) ఉద్యోగ ప్రకటన విడుదల అయింది.ఇందులో భాగంగా సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌ ,ఐసీటీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు.. ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా 2 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో ఒకటి సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఐసీటీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయంచారు.

ఏపీసీఆర్డీఏ నోటిఫికేషన్ – ముఖ్య వివరాలు
(AP)ఉద్యోగ ప్రకటన -ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ
ఉద్యోగాలు – 02
ఖాళీల వివరాలు – సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) 1, ఐసీటీ ఎగ్జిక్యూటివ్‌ (అప్లికేషన్‌ సపోర్ట్‌) -1
ఒక ఏడాది కాలానికి గానూ రిక్రూట్ మెంట్ చేస్తున్నారు.
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణత ఉండాలి. పని చేసిన అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం – ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం – 17 డిసెంబర్ 2025
దరఖాస్తులకు చివరి తేదీ – 30 డిసెంబర్ 2025
పని ప్రదేశం – ఏపీసీఆర్‌డీఏ, విజవాడ, అమరావతి.
అధికారిక వెబ్ సైట్ – https://crda.ap.gov.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com