సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!

- December 18, 2025 , by Maagulf
సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!

రియాద్: కార్మికులకు సౌదీ అరేబియా గుడ్ న్యూస్ తెలిపింది. పారిశ్రామిక లైసెన్సు కింద లైసెన్స్ పొందిన పారిశ్రామిక సంస్థలలోని ప్రవాస కార్మికులపై విధించిన రుసుములను రద్దు చేసింది. క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మరియు అభివృద్ధి వ్యవహారాల మండలి (CEDA) సిఫార్సు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం జాతీయ కర్మాగారాలను బలోపేతం చేయడంతోపాటు వాటి సుస్థిరతను మరియు పోటీతత్వాన్ని పెంపొందించడంలో సహయపడుతుందని, రాజ్యంలో సుస్థిర పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందిస్తుందని పరిశ్రమలు మరియు ఖనిజ వనరుల శాఖ మంత్రి బందర్ అల్ఖోరయెఫ్ అన్నారు. రాబోయే రోజుల్లో పారిశ్రామిక రంగం వృద్ధికి అన్ని సంబంధిత సంస్థలతో సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ప్రైవేట్ రంగానికి సాధికారత కల్పించడం ద్వారా పెట్టుబడి, ఆవిష్కరణ మరియు సాంకేతికతకు అనుకూలమైన పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com