ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- December 18, 2025
దోహా: ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) తన 31 ఆరోగ్య కేంద్రాలలో 21 కేంద్రాలు జాతీయ దినోత్సవ సెలవుదినం అయిన డిసెంబర్ 18న పనిచేస్తాయని ప్రకటించింది. జాతీయ దినోత్సవ సెలవుదినం సందర్భంగా, విధుల్లో ఉండే ఆరోగ్య కేంద్రాలు ఉదయం 7:00 నుండి రాత్రి 11:00 గంటల వరకు నిరంతరాయంగా ఫ్యామిలీ మెడిసిన్ మరియు సహాయక సేవలను అందిస్తాయని అన్నారు. అల్ వక్రా, అల్ మషాఫ్, అల్ తుమామా, ఎయిర్పోర్ట్, రౌదత్ అల్ ఖైల్, ఒమర్ బిన్ అల్ ఖత్తాబ్, అల్ సద్, వెస్ట్ బే, అల్ రువైస్, అల్ ఖోర్, లీబైబ్, ఉమ్ సలాల్, గరాఫా అల్ రయ్యాన్, ఖలీఫా సిటీ, అబూ బకర్ అల్ సిద్దిక్, అల్ రయ్యాన్, మెసైమీర్, మువైథర్, అల్ షీహానియా మరియు అల్ వాజ్బా సెంటర్లలో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ కేంద్రాలలో డెంటల్ సేవలు ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటాయని తెలిపారు. అల్ జుమైలియా ఆరోగ్య కేంద్రం రోజుకు 24 గంటలూ ఆన్-కాల్ ప్రాతిపదికన పనిచేస్తుందని ప్రకటించారు. సౌత్ వక్రా, ఉమ్ ఘువైలినా, అల్ వాబ్, అబూ నఖ్లా, ఉమ్ అల్ సెనీమ్, అల్ ఘువైరియా, అల్ ధాయెన్ మరియు ఖతార్ యూనివర్సిటీ ఆరోగ్య కేంద్రాలు జాతీయ దినోత్సవ సెలవుదినం సందర్భంగా మూసివేయబడతాయని తెలిపారు.అయితే అల్ కాబాన్ మరియు అల్ కరానా కేంద్రాలు పెద్దలకు అత్యవసర కేసులను స్వీకరిస్తాయని పేర్కొన్నారు.
సెలవుదినం సందర్భంగా 13 ఆరోగ్య కేంద్రాలు గర్రఫత్ అల్ రయ్యాన్, అల్ షీహానియా, అబూ బకర్ అల్ సిద్దిక్, రౌదత్ అల్ ఖైల్, అల్ కాబాన్, అల్ కరానా, అల్ రువైస్, ఉమ్ సలాల్, లీబైబ్, మువైథర్, అల్ మషాఫ్, అల్ సద్ మరియు అల్ వాజ్బా లో 24 గంటల అత్యవసర సంరక్షణ సేవలను అందిస్తాయని అన్నారు. సెలవుదినం సందర్భంగా ఏడు ఆరోగ్య కేంద్రాలు అల్ రువైస్, ఉమ్ సలాల్, లీబైబ్, మువైథర్, అల్ మషాఫ్, అల్ సద్ మరియు అల్ వాజ్బా పిల్లల అత్యవసర కేసులను స్వీకరిస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!







