రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు

- December 18, 2025 , by Maagulf
రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు

న్యూ ఢిల్లీ: రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు విధించడానికి రైల్వే  సిద్ధమైంది. విమానాశ్రయాల్లో మాదిరిగా రైళ్లలోనూ లగేజీపై నిబంధనలు అమలు చేస్తారా అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. ప్రయాణించే తరగతిని బట్టి ప్రతి ప్రయాణికుడు తమ వెంట ఉచితంగా తీసుకెళ్లగలిగే లగేజీపై పరిమితి ఉందని మంత్రి వివరించారు.వివిధ తరగతుల వారీగా ఉచిత లగేజీ పరిమితులను మంత్రి వెల్లడించారు.

థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్లలో కూడా 40 కేజీల వరకు ఉచిత అనుమతి ఉంది. ఏసీ 2-టైర్, ఫస్ట్ క్లాస్‌లో 50 కేజీల వరకు, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 70 కేజీల వరకు లగేజీని ఉచితంగా అనుమతిస్తారు. స్లీపర్, ఏసీ 3 టైర్‌లో ప్రయాణికులు 40Kgలు, 2nd AC ప్యాసింజర్లు 50Kgలు, 1st క్లాస్‌ ప్రయాణికులకు 70Kgల వరకు తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. జనరల్‌ బోగీలో ప్రయాణించే వాళ్లు 35Kgల లగేజీ తీసుకెళ్లవచ్చు.

5-12 ఏళ్ల పిల్లలకు ఆ పరిమితిలో 50% లేదా గరిష్ఠంగా 50Kgల వరకు అనుమతి ఉంటుంది. లగేజీ బరువుతో పాటు, దాని పరిమాణంపై కూడా నిబంధనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. 100 సెంటీ మీటర్లు, 60 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్ల కొలతలు మించని సూట్‌కేసులు, ట్రంకు పెట్టెలను మాత్రమే కంపార్ట్‌మెంట్‌లోకి అనుమతిస్తారు. ఈ సైజు కంటే పెద్దగా ఉన్నవాటిని తప్పనిసరిగా బ్రేక్‌వ్యాన్ లేదా పార్సిల్ వ్యాన్‌లో పెట్టి తరలించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com