ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!

- December 18, 2025 , by Maagulf
ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!

దోహా: ఖతార్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మధ్యాహ్నం లుసైల్ ప్యాలెస్ ప్రాంగణంలో జరిగిన ఖతార్ సాంప్రదాయ కత్తి డ్యాన్స్(అర్దా)లో అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హెచ్‌హెచ్ అమీర్ వ్యక్తిగత ప్రతినిధి హెచ్‌హెచ్ షేక్ జస్సిమ్ బిన్ హమద్ అల్-థానీ, హెచ్‌హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్-థానీ మరియు పలువురు ఈ అర్దాలో పాల్గొన్నారు. షూరా కౌన్సిల్ స్పీకర్ హెచ్‌ఈ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనిమ్ తోపాటు గెస్టులైన మంత్రులు, ప్రముఖులు మరియు పౌరుల బృందం కూడా ఈ అర్దాలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com