ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్‌ ఓం బిర్లా..

- December 19, 2025 , by Maagulf
ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్‌ ఓం బిర్లా..

న్యూ ఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఇవాళ ఉభ‌య‌స‌భ‌లు వాయిదా ప‌డ్డాయి. లోక్‌స‌భ‌, రాజ్యస‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు.చివ‌రి రోజు స‌భ‌కు ప్రధాని మోదీ హాజ‌ర‌య్యారు. ఇక ఉభయసభలు నిరవధిక వాయిదా అనంతరం ఎంపీలకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తేనీటి విందు ఇచ్చారు. పార్లమెంట్ భవనంలోని తన ఛాంబర్‌లో లోక్‌సభ ఎంపీలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, ప్రియాంకా గాంధీ, పలువురు అఖిలపక్ష ఎంపీలు హాజరయ్యారు. వీబీ జీ రామ్ జీ బిల్లుకు వ్య‌తిరేకంగా లోక్‌స‌భ‌లో విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. అయితే ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యానికి అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ నేప‌థ్యంలో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. చివ‌రి రోజు స‌భ‌కు ప్ర‌ధాని మోదీ హాజ‌ర‌య్యారు. మ‌న్రేగా స్థానంలో కేంద్ర ప్ర‌భుత్వం జీ రామ్ జీ బిల్లును తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ బిల్లును వ్య‌తిరేకిస్తూ గురువారం విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. బిల్లు ప్ర‌తుల‌ను చింపి, నినాదాలు చేశాయి. మూజువాణి ఓటు ద్వారా రాజ్య‌స‌భ‌లోనూ ఆ బిల్లు పాసైంది.

రాజ్య‌స‌భ‌ను కూడా ఇవాళ నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్ మాట్లాడుతూ 269వ రాజ్య‌స‌భ స‌మావేశాలు ముగిసిన‌ట్లు వెల్ల‌డించారు. త‌న‌ను రాజ్య‌స‌భ చైర్మెన్‌గా ఎంపిక చేసినందుకు స‌భ్యుల‌కు ఆయ‌న థ్యాంక్స్ తెలిపారు. సభా కార్య‌క్ర‌మాలు జ‌రిగిన తీరు ప‌ట్ల ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. మునుముందు కూడా ఇలాగే స‌భ కొన‌సాగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. జీరో అవ‌ర్‌, క్వ‌శ్చ‌న్ అవ‌ర్ చాలా ప్ర‌యోజ‌న‌క‌రంగా జ‌రిగిన‌ట్లు సీపీ రాధాకృష్ణ‌న్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com