బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!

- December 19, 2025 , by Maagulf
బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!

మనామా: బహ్రెయిన్ లో ఆకస్మాత్తుగా కురిసిన వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. పలు ప్రాంతాల్లో ఆస్తులకు నష్టం జరిగింది. ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు గంటల పాటు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. మరోవైపు బాధితులను రక్షించేందుకు ఇంటిరియర్ మినిస్ట్రీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.  మంత్రిత్వ శాఖలోని సంబంధిత విభాగాలు తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయని పేర్కొంది.

మరోవైపు, ప్రభావిత ప్రాంతాలలో నీరు పేరుకుపోవడంపై వచ్చిన నివేదికలను అధికారులు చురుకుగా పరిష్కరిస్తున్నారు.  క్షేత్రస్థాయి భద్రతా చర్యలను అమలు చేస్తున్నారు. ప్రజలను వారి ఆస్తులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల భద్రతపై ఆందోళన వద్దని, పూర్తిస్థాయిలో సర్వ సన్నద్ధంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.  అత్యవసర సమయాల్లో అధికారులకు నివేదించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com