రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- December 20, 2025
మనామా: బహ్రెయిన్ లో ప్రముఖ ఇస్లామిక్ బ్యాంక్ అయిన అల్ బరాకా ఇస్లామిక్ బ్యాంక్ బహ్రెయిన్.. రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది. మాస్టర్ కార్డ్ టైటానియం, ప్లాటినం మరియు వరల్డ్ కార్డులను రీ సైకిల్ మెటిరియల్ తో తయారు చేస్తున్నట్లు తెలిపింది.
ఆధునిక డిజైన్‌ను కలిగి ఉన్న ఈ కొత్త క్రెడిట్ కార్డులు రీసైకిల్ చేయబడిన పదార్థాల నుండి తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇది పర్యావరణ పరిరక్షణ పట్ల బ్యాంక్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
అల్ బరాకా క్రెడిట్ కార్డ్స్ పోర్ట్‌ఫోలియోలో భాగంగా కార్డ్ హోల్డర్లు ప్రపంచవ్యాప్తంగా 1,200 కి పైగా విమానాశ్రయ లాంజ్‌లకు ఉచిత యాక్సెస్, 24-గంటల కన్సైర్జ్ సేవలు, సమగ్ర ప్రయాణ బీమా మరియు $500,000 వరకు అత్యవసర వైద్య కవరేజ్ వంటి విస్తృత శ్రేణి ప్రయోజనాలను పొందుతారని అల్ బరాకా ఇస్లామిక్ బ్యాంక్ చీఫ్ రిటైల్ ఆఫీసర్ మజిన్ ధైఫ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







