కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!

- December 20, 2025 , by Maagulf
కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!

జెడ్డా: కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మగ్లింగ్ ప్రయత్నాన్ని జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) అధికారులు భగ్నం చేశారు.  ఒక ఇన్‌కమింగ్ పార్సిల్ లో దాచి ఉంచిన 187,000 ఆంఫెటమైన్ పిల్స్ (క్యాప్టగాన్) ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ZATCA ప్రతినిధి హమూద్ అల్-హర్బీ తెలిపారు. ఆ పార్సిల్స్ ను డైనింగ్ టేబుల్స్ గా ప్రకటించారని పేర్కొన్నారు.

మోడ్రన్ స్క్రీనింగ్ టెక్నాలజీ సాయంతో తనిఖీ చేయగా స్మగ్లింగ్ గుట్టురట్టు అయిందన్నారు.   అనంతరం పార్సిల్స్ రిసివర్స్ ను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్‌ టీమ్ సమన్వయంతో ట్రాక్ చేసి, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.  స్మగ్లింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేక భద్రతా హాట్‌లైన్ 1910 ద్వారా లేదా అంతర్జాతీయ నంబర్ 009661910 ద్వారా తెలియజేయాలని అల్-హర్బీ కోరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com