హీరో రోషన్ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- December 20, 2025
స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ 'ఛాంపియన్' ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్ చరణ్ గారు మిమ్మల్ని చాలా ప్రశంసించారు కదా.. ఎలా అనిపించింది?
-చాలా ఆనందంగా ఉంది. చరణ్ అన్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా గురించి మా సినిమా గురించి టీం గురించి ఆయన చాలా బాగా మాట్లాడారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది.
మగధీరతో పోల్చారు కదా.. కాన్సెప్ట్ అంతా హెవీగా ఉంటుందా?
-1948లో జరిగే కథ ఇది.. యాక్షన్ డ్రామా వార్ అన్ని చాలా గ్రాండ్ గా ఉంటాయి. చరిత్రలో బైరాన్ పల్లి గురించి చాలామందికి తెలుసు. అందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసి ఈ కథని ప్రజెంట్ చేయడం జరిగింది.
ఈ క్యారెక్టర్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?
-నేను మామూలుగా తెలుగు మాట్లాడతాను. అయితే ఈ క్యారెక్టర్ ప్రాపర్ హైదరాబాది. ఆ యాస స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది. మా డైరెక్టర్ హెల్ప్ తో పాటు వర్క్ షాప్స్ కూడా చేశాం.
ఈ సినిమాకి మూడేళ్లు సమయం కేటాయించడానికి కారణం?
- నిజానికి హీరోలందరూ 25 ఏళ్లు ఏజ్ లోనే వస్తారు. నేను 21 ఏళ్లకే వచ్చేసాను. బ్రేక్ లాగా అనిపిస్తుంది కానీ కరెక్ట్ ఏజ్ ఇదే. కం బ్యాక్ ఇవ్వడానికి ఇదే కరెక్ట్ ఏజ్. ఈ గ్యాప్ తీసుకోవడం కూడా కంప్లీట్ గా నా నిర్ణయమే.
ఈ మూడేళ్లలో ఏం చేశారు ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు?
యాక్టింగ్ అంటే చాలా హ్యూమన్ ఎమోషన్స్ తెలియాలి. దానికి ఒక మెచ్యూరిటీ కావాలి.ఈ మూడేళ్లలో చాలా ట్రావెల్ చేశాను. చాలా నేర్చుకున్నాను. ఈ మూడేళ్లు చాలా హ్యాపీగా జరిగింది
ఛాంపియన్ యాక్షన్ గురించి?
-పీటర్ అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. షూటింగ్లో నాకు కొన్ని గాయాలు కూడా అయ్యాయి. అయితే యాక్షన్ సినిమా అంటే ఇలాంటివి మామూలే.
ఈ సినిమాకి ఎలాంటి రిఫరెన్స్ తీసుకున్నారు?
-ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్ కి స్వతంత్రం రాని రోజుల్లో జరిగిన కథ ఇది. మా డైరెక్టర్ గారు అన్ని రిఫరెన్సులు ఇచ్చారు.స్వప్న చాలా పర్టికులర్ గా ఉంటారు. డైరెక్టర్, స్వప్న, ఆర్ డైరెక్టర్ తోట ప్రతిదీ రీసెర్చ్ చేశారు.ఆ కాలంలో ఎలా ఉండేవారు డైరెక్టర్ ప్రతీది కేర్ తీసుకుని చేశారు.ఈ సినిమా కోసం చాలా వర్క్ షాపులు కూడా చేశాము. ఇందులో అద్భుతమైన డ్రామా ఉంది.ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది.
కోవై సరళ గారితో పని చేయడం ఎలా అనిపించింది?
-కోవై సరళ నాన్నతో కూడా చాలా సినిమాలు చేశారు. చాలా అద్భుతమైన టైమింగ్ వున్న నటి.ఈ సినిమాలో నాన్న గారితో పనిచేసిన చాలామంది నటీనటులతో కలిసి నటించే అవకాశం దొరికింది.
విజువల్స్ చూస్తుంటే చాలా గ్రాండ్ గా ఉన్నాయి చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టినట్టు అనిపిస్తోంది.. ఆ ఒత్తిడి మీకు ఉందా?
-హాలీవుడ్ లో స్పైడర్ మాన్ లాంటి సినిమాలు దాదాపు 3000 కోట్లు పెట్టి తీస్తారు కానీ అందులో ఒక కొత్త నటుడు ఉంటాడు. ఖర్చు పెట్టేది సినిమా మీద. అంత స్ట్రాంగ్ సబ్జెక్టు ఉంది కాబట్టే అంత పెట్టారు.
-ఒత్తిడి ఉంటుంది. అయితే నేను దృష్టి పెట్టాల్సింది యాక్టింగ్ పైనే. నేనొక్కడినే కాదు బైరాన్ పల్లి గ్రామంలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కి ఒక ప్రారంభం ముగింపు ఉంటుంది.
స్క్రిప్ట్ పరంగా మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది?
-స్క్రిప్ట్ పరంగా నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. కథ వినగానే నచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమానే చేయాలనుకున్నాను. అయితే నా క్యారెక్టర్ ఎలా చేయాలి? ఎలా వుంటే బావుటుందనేది డైరెక్టర్ తో చర్చించుకునే వాడిని.
హీరోయిన్ అనస్వర గురించి?
-ఇందులో హీరో హీరోయిన్ మధ్య డ్రామా అనే కాన్సెప్ట్ తో చాలా మంచి ఫన్ ఉంటుంది. అనస్వర మలయాళంలో దాదాపు 25 సినిమాలు చేసింది. చాలా ఎక్స్పీరియన్స్. తన క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉంటుంది. హీరో పర్పస్ ని ఫుల్ ఫిల్ చేస్తుంది.
మ్యూజిక్ గురించి?
-ఇందాకే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూసి వచ్చాను.ఇందులో ఒక కొత్త మిక్కీ జే మేయర్ ని చూస్తారు. యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది.యాక్షన్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా ఉంటుంది.
ఇందులో వింటేజ్ కార్ కనిపిస్తుంది దానికి ప్రాధాన్యత ఉంటుందా?
-ఇందులో కనిపించే ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కార్ కూడా ఒక క్యారెక్టర్. అలాగే గన్స్ బాల్..ప్రతి వస్తువు కూడా చాలా ఇంపార్టెంట్.
ఫుట్ బాల్ నేర్చుకున్నారా?
-నేను స్కూల్లో ఆడేవాడిని. అది ఇందులో హెల్ప్ అయింది. హీరోకి మోటివేషన్ ఫుట్బాల్.
నేను హార్స్ రైడింగ్ చిన్నప్పుడే నేర్చుకున్నాను.
నాన్నకి ఒక ఫ్యామిలీ ఇమేజ్ ఉంది మీకు ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది?
-ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటాను. ఒకే తరహా సినిమాలు చేసుకుంటూ పోతే బోర్ కొడుతుంది. ఇప్పుడు ఆడియన్స్ మనస్తత్వం కూడా మారిపోయింది. ఆడియన్స్ ధియేటర్ రావాలంటే ఒక ఒక ఎక్స్పీరియన్స్ ఉండే కథలు చేయాలి.
నా ఫేవరెట్ జోనర్ యాక్షన్. నేను చేసే సినిమాలు ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత హ్యాపీ.
కళ్యాణ్ చక్రవర్తి పాత్ర ఎలా ఉంటుంది?
-బైరాన్ పల్లి గ్రామంలో ఒక నిజమైన పాత్ర స్ఫూర్తితో రాసుకున్న క్యారెక్టర్ అది. ఆయనతో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతి. ఆయన డాక్టర్ కూడా. చాలా విషయాలు పంచుకునేవారు. నిజంగా ఇది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.
ఛాంపియన్ సినిమా మిమ్మల్ని ఏరకంగా మార్చింది అంటే?
-నాలో ఓపికను పెంచింది.యాక్టర్ గా కూడా చాలా కొత్త రోషన్ ని చూస్తారు. అప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది.ఒక కొత్త మనిషి కనిపిస్తాడు. ఈ సినిమా చూసిన తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకొని మంచి పని చేశాడని మీరే అంటారు. సినిమా రష్ చూసాం చాలా అద్భుతంగా వచ్చింది.
ఇండస్ట్రీలో మీ బాండింగ్ ఎలా ఉంటుంది?
-అఖిల్ అన్న నాకు చాలా మంచి ఫ్రెండ్. అలాగే తమన్ అన్న.. మేమందరం కలిసి క్రికెట్ ఆడుతాం.
స్క్రిప్ట్ సెలక్షన్ లో నాన్నగారి సలహాలు తీసుకుంటారా?
-నాన్న వింటారు కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం నాకే వదిలేస్తారు. ఈ సినిమా కథ కూడా ఒక లైన్ లా విన్నారు. తర్వాత అంతా నా ఇష్టానికే ఇచ్చారు .
డైరెక్టర్ ప్రదీప్ గురించి
-ప్రదీప్ ది వరంగల్. నేచురల్ గానే ఆయనకి ఆ ఎమోషన్ వచ్చేస్తుంది. ఆయన ఎంచుకున్న ప్రతి నటీనటులు ఈ కథకు పర్ఫెక్ట్ యాప్ట్.
నిర్మాతల సపోర్టు గురించి నిర్మాతల సపోర్టు గురించి?
-స్వప్న అక్క ప్రియాంక అక్క దత్తు గారు అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. దత్త గారు ఎంతోమందిని లాంచ్ చేశారు. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశారు. అలాంటి ప్రొడ్యూసర్ నాకు ఇంత గ్రాండ్ గా ఛాంపియన్ సినిమా ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
నాగ్ అశ్విన్ ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు?
నేను చాలా మొహమాటంగా వుంటాను. కొంచెం ఓపెన్ గా ఉండు, మాట్లాడు అని చెప్పారు( నవ్వుతూ)
ముందు నుంచి యాక్టర్ అవ్వాలనే ఫిక్స్ అయ్యారా?
-నేను ఫస్ట్ క్రికెటర్ అవ్వాలనుకున్నాను. నిజానికి మా నాన్నకోరిక కూడా నేను క్రికెటర్ అవ్వాలని. అయితే నాకు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.
షూటింగ్ ఛాంపియన్ షూటింగ్ ఎన్ని రోజులు చేశారు?
-వంద రోజులు చేసాం. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి. దానికోసం ప్రత్యేకంగా ప్రిపరేషన్ జరిగింది. అలాగే నాకు షూటింగ్ లో గాయాలు కావడం వల్ల కూడా కొన్ని రోజులు షూటింగ్ గ్యాప్ వచ్చేది.
మీ తొలి హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు స్టార్ అయ్యారు కదా.. మాట్లాడుతుంటారు?
-తను నాకు మంచి ఫ్రెండ్. మేము మాట్లాడుతుంటాం. తన కెరీర్ అద్భుతంగా ముందుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది.
ఛాంపియన్ ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది?
-ఇందులో చాలా మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. ఊర్లో ఉండే ఎమోషన్స్ ఛాంపియన్ లో చాలా అద్భుతంగా చూపించారు. ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది.
మీరు చేయబోయే కొత్త సినిమా గురించి?
-త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది. ఈసారి ఎక్కువ గ్యాప్ లేకుండా కనీసం రెండు సంవత్సరాలకి మూడు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







