'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్

- December 20, 2025 , by Maagulf
\'భర్త మహాశయులకు విజ్ఞప్తి\' జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మ్యాసీవ్ బజ్‌ను సృష్టించాయి. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.  

ప్రెస్ మీట్ లో డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13న సంక్రాంతికి మీ అందరి ముందుకు రాబోతోంది. కచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో మన తెలుగు ప్రేక్షకులకు మంచి ఫన్,  సాంగ్స్ అన్నీ కలిపి మీ అందరినీ ఆకట్టుకునేలాగా 100% ఉంటుంది. రవితేజ గారికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని ఉద్దేశంతోనే ఈ కథ రాయడం జరిగింది. డెఫినెట్ మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఇది ఫుల్ ఎంటర్టైనర్. మన జీవితం తెరపై చూసుకున్నట్టుగానే ఉంటుంది. రవితేజ రవితేజ గారి మార్క్ ఫన్ మిస్ అవ్వకుండా నా ట్రీట్మెంట్ తో సినిమాని చాలా ఎంటర్టైనింగ్ గా చేయడం జరిగింది. రవితేజ చాలా ఫ్రెష్ గా కనిపిస్తారు. రవితేజ గారు ముందే ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. నా గురించి కాకుండా నీ స్టైల్ లో కథ చేస్తే క్యారెక్టర్ ఫ్రెష్ నెస్  వస్తుందని చెప్పారు. మేము కూడా ఈ సినిమాలో రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో అలానే ట్రీట్ చేయడం జరిగింది. క్యారెక్టర్ నే ఫాలో అయ్యాము. ఖచ్చితంగా ఈ సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది.

ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం. జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి' రిలీజ్ అవుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది. మాతో పాటు వస్తున్న సినిమాలను కూడా బాగా ఆడి కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ సినిమాలు బాగా ఆడుతాయి. ఈ సంక్రాంతికి రావాలని ఉద్దేశంతోనే ఈ సినిమాని చేసాం.

హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కిషోర్ తిరుమల గారు సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన డైరెక్షన్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నా క్యారెక్టర్ పేరు బాలామణి. ఇందులో ఒక కొత్త డింపుల్ ని చూస్తారు. ఇది భోగి రోజున రిలీజ్ అవుతుంది. ఇది నా ఫస్ట్ సంక్రాంతి సినిమా చాలా స్పెషల్.

 హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ టైటిల్ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఇది ఎంటర్టైనింగ్ ఫన్ ఫ్యామిలీ ఫిలిం. మోడరన్ రిలేషన్ షిప్ గురించి చాలా హ్యూమరస్ సెన్సిబుల్ గా చెబుతున్నాం. క్టర్ గారు అద్భుతంగా రాసి తీశారు.ఇందులో మానస శెట్టి పాత్రలో కనిపిస్తాను.చాలా మోడరన్ కాన్ఫిడెంట్ బోల్డ్  క్యారెక్టర్.  అందరికీ నచ్చుతుంది. తేజ గారు చాలా ఫన్ అండ్ ఎంటర్టైనింగ్.ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.ఇందులో చాలా కొత్త డిఫరెంట్ రవితేజ గారు కనిపిస్తారు. చాలా అద్భుతమైన  టీంతో భారీగా తీసిన సినిమా ఇది.సినిమా చూస్తున్నప్పుడు ఒక సంక్రాంతి పండగలా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది.

నటీనటులు: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
DOP: ప్రసాద్ మూరెళ్ల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్ చాగంటి
PRO: వంశీ-శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com