Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- December 22, 2025
యూఏఈ: బిగ్ టికెట్ రెండవ వీక్లీ ఈ-డ్రాలో ఐదుగురు ప్రవాసులు ఒక్కొక్కరు Dh100,000 గెలుపొందారు. విజేతలలో నలుగురు భారతీయ ప్రవాసులు ఉన్నారు.57 ఏళ్ల భారతీయ డ్రైవర్ అయిన బషీర్ కైపురత్ గత 25 సంవత్సరాలుగా దుబాయ్లో నివసిస్తున్నారు. కేరళకు చెందిన బషీర్, రెండు సంవత్సరాలకు పైగా బిగ్ టికెట్ వీక్లీ ఈ-డ్రాలో పాల్గొంటున్నారు.తన బహుమతిలో కొంత భాగాన్ని ఇండియాలోని తన కుటుంబానికి ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు.
మరొక భారతీయ ప్రవాసి వినాయగ మూర్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి విజేతగా నిలిచాడు. వీరితోపాటు 15 సంవత్సరాలుగా అల్ ఐన్లో నివసిస్తున్న 33 ఏళ్ల బంగ్లాదేశీ ప్రవాసి సోబరాజ్ ఖా రఫీక్ ఖా, 20 మంది స్నేహితుల బృందంతో కలిసి వీక్లీ డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపాడు.
గత 20 సంవత్సరాలుగా దుబాయ్లో ఉంటున్న భారత్ లోని చెన్నైకి చెందిన 40 ఏళ్ల వసతి గృహాల ఇన్ఛార్జ్ మిన్నాలేశ్వరన్ శక్తి వినాయగం Dh100,000 గెలుచుకున్నారు. భారత్ కే చెందిన 45 ఏళ్ల ఐటీ మేనేజర్ మహమ్మద్ జావేద్ రాజ్భరీ కూడా విజేతగా నిలిచాడు. గత 19 సంవత్సరాలుగా అతను యూఏఈలో నివసిస్తున్నారు. ప్రైజ్ మనీతో తన భార్యతో కలిసి మ్యూచువల్ ఫండ్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నానని, అదే సమయంలో గెలుచుకున్న మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నాడు.
బిగ్ టికెట్ ఈ సంవత్సరం 30 మిలియన్ దిర్హమ్ల భారీ బహుమతిని అందిస్తోంది. దీనిని జనవరి 3న జరిగే లైవ్ డ్రాలో ప్రకటిస్తారు. అదే రోజు ఐదుగురు అదృష్టవంతులకు ఒక్కొక్కరికి 50,000 దిర్హమ్ల చొప్పున అందిస్తారు. ప్రతి వారం, ఐదుగురు విజేతలు ఒక్కొక్కరు 100,000 దిర్హమ్లను గెలుచుకుంటారు. డిసెంబర్ 1 మరియు 24 మధ్య ఒకే లావాదేవీలో రెండు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ టిక్కెట్లను కొనుగోలు చేసిన వారు ఆటోమేటిక్గా 'ది బిగ్ విన్ కాంటెస్ట్'లో ప్రవేశిస్తారు. జనవరి 3న జరిగే లైవ్ డ్రాలో పాల్గొనడానికి నలుగురిని ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి 50,000 నుండి 150,000 దిర్హమ్ల మధ్య కచ్చితమైన బహుమతిని అందజేస్తారు. వారి పేర్లను జనవరి 1న అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు. వీరితోపాటు డ్రీమ్ కార్ సిరీస్ 2026 వరకు కొనసాగనుంది. జనవరి 3 డ్రాలో BMW 430i , ఫిబ్రవరి 3న BMW X5 విజేతలకు అందజేస్తారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







