ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!

- December 23, 2025 , by Maagulf
ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!

దోహా: ఖతార్ లో పబ్లిక్ వర్క్స్ అథారిటీ ట్రాఫిక్ అలెర్ట్ జారీ చేసింది.  సల్వా రోడ్ నుండి ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ వైపు వెళ్లే ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ 14ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ రహదారి డిసెంబర్ 25వతేదీ అర్ధరాత్రి 12 గంటల నుండి డిసెంబర్ 27 ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుంది. రోడ్ నిర్వహణ పనులను చేపట్టడానికి వీలుగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అష్ఘల్ పేర్కొంది. వాహనదారులు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com