కువైట్‌లో ఇన్‌క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- December 23, 2025
కువైట్: భారత్ -కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కువైట్‌లో ఇన్‌క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని కువైట్‌లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి, కువైట్ టూరిస్టిక్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ (TEC) CEO అన్వర్ అబ్దుల్లా అల్-హులైలాతో కలిసి ఐకానిక్ కువైట్ టవర్స్ లో ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కువైట్ మరియు ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు మరియు ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.
నెల రోజుల పాటు జరిగే ఈ ప్రచారంలో భాగంగా, భారత్ లోని వైవిధ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి వివరిస్తారు. కువైట్ అంతటా ప్రయాణించే 20 ప్రమోషనల్ బస్సులను రాయబారి త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు.2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన 'మదర్ ఫర్ మదర్ (ఏక్ పెడ్ మా కే నామ్)' చొరవలో భాగంగా రాయబారి త్రిపాఠి కువైట్ టవర్స్‌లో వేప మొక్కను నాటారు.
ఇండియా పర్యాటక రంగంలో బలమైన వృద్ధిని కొనసాగిస్తోంది.దాదాపు 3 బిలియన్ దేశీయ పర్యాటకుల సందర్శనలతో పాటు, 2024లో దాదాపు 20.94 మిలియన్ల విదేశీ పర్యాటకులు భారత్ ను సందర్శించారు. పర్యాటక రంగం భారత GDPకి దాదాపు 5.2 శాతం మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తుంది. అదే సమయంలో మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తోంది.
ఈ ప్రచారంలో భాగంగా #IncredibleIndia అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇంక్రెడిబుల్ ఇండియా బస్సుల ఫోటోలను పోస్ట్ చేసే పాల్గొనేవారి కోసం ఒక లక్కీ డ్రా కూడా నిర్వహించబడుతుంది.
తాజా వార్తలు
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్‌క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు







