క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- December 23, 2025
విజయవాడ: క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.క్రైస్తవులకు సంక్షేమం, ఆర్ధిక చేయూత అందించింది తమ ప్రభుత్వమేనని అన్నారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.క్రిస్మస్ కేట్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది.ఏసు ప్రభువు ఈ లోకంలో జన్మించిన రోజును మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్. మేరీ మాత కడుపున ఏసు ప్రభువు జన్మించిన పవిత్రమైన రోజు మన అందరికీ పండుగైంది.
ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన ఏసు సందేశం ఎప్పటికీ మార్గదర్శకం. క్రీస్తు బోధనల్ని ఆయన చూపిన బాటను అంతా అనుసరించాలి. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు ఏసు. నమ్మిన సిద్దాంతం కోసం బలి దానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పదనం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలి. ప్రభువు తాగ్యాన్ని స్మరించుకోవాలి. శాంతి మార్గాన్ని అనుసరించాలి. ప్రేమ తత్వాన్ని పెంచాలి. ఈర్ష్య, ద్వేషాలకు దూరంగా ఉండి పాపులను సైతం క్షమించాలని బైబిల్ చెబుతోందని ముఖ్యమంత్రి అన్నారు. గత ఐదేళ్లలో అసమర్థ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నేను ఎంత లోతుకు పోతే అన్ని ఎక్కువ సమస్యలు కనపడుతున్నాయి. ఇలాంటి విధ్వంసం నా జీవితంలో చూడలేదు.
మనో సంకల్పంతో లక్ష్యాన్ని సాధిస్తున్నాము. 18 నెలల్లో రాష్ట్రం నిలదొక్కుకునే పరిస్థితికి తీసుకొచ్చాము. ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేశాం. క్రైస్తవుల్లో పేద కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ ఆర్థిక భరోసా కల్పించాం. ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం కోసం రూ. 22 కోట్లు ఖర్చు చేసి,44,812 మంది క్రైస్తవ సోదర సోదరీమణులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నాం. మే 2024 నుంచి నవంబర్ 2024 వరకు… మొత్తం రూ.30 కోట్లు విడుదల చేశాం. డిసెంబర్ 2024 నుంచి నవంబర్ 2025 వరకు రూ.51 కోట్ల సాయాన్ని ఈ నెల 24వ తేదీ లోగా వారి ఖాతాల్లో వేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
సమాజ సేవలో క్రైస్తవ సంస్థలు ముందున్నాయి. క్రిస్టియన్ పాఠశాలలు, కాలేజ్ లు, ఆసుపత్రులు దశాబ్దాలుగా చేస్తున్న సేవలు వెలకట్ట లేనివి. లక్షల మంది జీవితాల్లో మార్పు తెస్తున్నాయి. మిషనరీ పాఠశాలల్లో చదివి ఎంతోమంది ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్లారు. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ కు మిషనరీ విద్యా సంస్థలు కేంద్రంగా ఉన్నాయి. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ, ఆంధ్ర లయోలా కాలేజీ వంటి క్రిస్టియన్ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నతికి సేవ చేశాయి. ఎన్టీఆర్ కూడా మిషనరీ కాలేజ్ లోనే చదువుకున్నారు. పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం నిర్ధుష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.మైనార్టీ సంక్షేమశాఖా మంత్రి ఫరూక్, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, ఎంఎల్ఎలు గద్దె రామ్మోహనరావు, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!







