రియాద్‌లో ఆరుగురు పాకిస్తానీలు అరెస్టు..!!

- December 24, 2025 , by Maagulf
రియాద్‌లో ఆరుగురు పాకిస్తానీలు అరెస్టు..!!

రియాద్: జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) సమన్వయంతో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (GDNC) రియాద్ ప్రాంతంలో ఆరుగురు పాకిస్తానీ నివాసితులను అరెస్టు చేసింది. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ భద్రతా ప్రతినిధి తలాల్ అల్-షల్హౌబ్ వెల్లడించారు. 71 కిలోల మెథాంఫేటమిన్ డెలివరీని వీరు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నట్లు తెలిపింది.

నార్కోటిక్స్ కంట్రోల్ డైరెక్టరేట్ అందించిన సమాచారంతో రెండు స్మగ్లింగ్ ప్రయత్నాలను విఫలం చేసినట్లు అల్-షల్హౌబ్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ల ఫలితంగా 200 కిలోగ్రాములకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. క్రిమినల్ నెట్‌వర్క్‌లను ట్రాక్ చేయడంలో మరియు అడ్డుకోవడంలో సౌదీ అరేబియా , ఒమన్ మధ్య సమర్థవంతమైన సహకారంపై అల్-షల్హౌబ్ ప్రశంసలు కురిపించారు. 

సౌదీ అరేబియా తన భద్రతను మరియు యువతను మాదకద్రవ్యాల ద్వారా లక్ష్యంగా చేసుకునే నేర కార్యకలాపాలను పర్యవేక్షిస్తూనే ఉంటుందని, అటువంటి ప్రయత్నాలను ఎదుర్కొని అడ్డుకుంటుందని స్పష్టం చేశారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా అక్రమ రవాణాకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని నివేదించాలని అల్-షల్హౌబ్ ప్రజలను కోరారు. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో నివసించేవారు 911 కు కాల్ చేయాలని, ఇతర ప్రాంతాలలో నివసించేవారు 999 కు డయల్ చేయవచ్చని తెలిపారు.  స్మగ్లింగ్ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని 995 నెంబర్ ద్వారా GDNC కి కూడా తెలియజేయవచ్చని ఆయన అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com