దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం

- December 24, 2025 , by Maagulf
దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం

దుబాయ్: తెలుగు భాషకే గర్వకారణమైన శతావధాన సంప్రదాయం దుబాయ్‌లో మరోసారి వైభవంగా ఆవిష్కృతమైంది. స్థానికంగా గణేష్ రాయపూడి మరియు పద్మజ రాయపూడి నివాసంలో నిర్వహించిన శతావధాన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ తమ అసాధారణ పాండిత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.అనంతరం గోదా కళ్యాణం కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా దుబాయ్ మరియు అబుదాబి రాజుల పై అడిగిన ఒక సంక్లిష్టమైన ప్రశ్నకు, బ్రహ్మశ్రీ పద్మాకర్ ఆశుకవిత రూపంలో చక్కని శతావధాన పద్యాన్ని చెప్పి అద్భుత సమాధానాన్ని అందించారు. ఈ తక్షణ కవిత్వం, స్మృతి, లయ, ఛందస్సుల సమన్వయం శతావధాన విశిష్టతను మరోసారి నిరూపించింది.

కార్యక్రమంలో పాల్గొన్నవారు, పద్మాకర్ పాండిత్యం, తెలుగు భాష యొక్క అపూర్వమైన సంపద, శతావధానం అనే అరుదైన సాహిత్య కళ యొక్క గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా మరోసారి తెలిసిందని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు తెలుగు భాష పరిరక్షణకు, భావి తరాలకు మన సాంస్కృతిక వారసత్వాన్ని అందించడానికి ఎంతో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

యూఏఈలోని తెలుగు ప్రజలకు ఈ సందేశాన్ని విస్తృతంగా చేరవేసి, తెలుగు భాష గొప్పదనాన్ని, శతావధానం ప్రాముఖ్యతను భావి తరాలకు నేర్పాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com