షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా స్ట్రీట్‌ మూసివేత..!!

- December 24, 2025 , by Maagulf
షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా స్ట్రీట్‌ మూసివేత..!!

మనామా: షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా స్ట్రీట్‌ ను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు బహ్రెయిన్ ట్రాఫిక్‌ డైరెక్టరేట్ తెలిపింది. 400 kV విద్యుత్ కేబుళ్ల విస్తరణకు వీలుగా ఈ మూసివేత ఆంక్షలను అమలు చేయనన్నట్లు వెల్లడించింది.

ఈ పనుల కోసం షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా స్ట్రీట్ నుండి మినా సల్మాన్ దిశగా షేక్ ఇసా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లోకి కుడివైపు తిరిగే చోట ఒక లేన్‌ను దశలవారీగా మూసివేయాల్సి ఉంటుందని, ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఒక లేన్ లో ట్రాఫిక్ ను అనుమతించనున్నట్లు తెలిపింది.

ఈ మూసివేత ఆంక్షలు డిసెంబర్ 25వతేది రాత్రి 11:00 గంటల నుండి డిసెంబర్ 28  ఉదయం 5:00 గంటల వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com