సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, ఫ్లూ షాట్ డ్రైవ్
- December 24, 2025
అమెరికా: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా సెయింట్ లూయిస్ మహాత్మ గాంధీ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం, ఉచిత ఫ్లూ షాట్ డ్రైవ్‌ను అత్యంత విజయవంతంగా నిర్వహించింది. మిస్సోరీ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ వైద్యశిబిరంలో స్థానిక తెలుగు వారితో పాటు ఇతర వర్గాల వారికి వైద్య సేవలు ఉచితంగా అందించారు.ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సలహాలు, పరీక్షలు నిర్వహించారు.నాట్స్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి, ప్రముఖ హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్ డాక్టర్ నిశాంత్ పొద్దార్, ఇంటర్నల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ బాపూజీ దర్శి రోగుల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన సూచనలు, పరీక్షలు చేశారు. అలాగే, చలికాలం దృష్ట్యా వ్యాధుల బారి నుండి రక్షణ పొందేందుకు డాక్టర్ ఏజే పర్యవేక్షణలో రోగులందరికీ ఉచితంగా ఫ్లూ వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.
సమాజ సేవ చేసేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ మిస్సోరి చాప్టర్ కోఆర్డినేటర్ సందీప్ కొల్లిపర అన్నారు. వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లకు, నాట్స్ మిస్సోరి చాప్టర్ బృందానికి నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు సందీప్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సెయింట్ లూయిస్‌లో ప్రతి నెల క్రమం తప్పకుండా వైద్య శిబిరం నిర్వహిస్తున్న నాట్స్ మిస్సోరీ చాప్టర్ నాయకులను, వైద్యులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు.
తాజా వార్తలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్
- పిపిపి మోడల్ సరైనదే: మంత్రి పార్థసారథి







