కొబ్బరి బర్ఫీ
- July 27, 2016
కావలసిన పదార్ధాలు..
* కొబ్బరిపాలు : 4 కప్పులు
* కొబ్బరి తురుము : కప్పు
* పంచదార : ఒకటిన్నర కప్పు
* బటర్ స్కాచ్ కస్టర్డ్ పౌడర్ : 3 టేబుల్ స్పూన్లు
* వెనీలా కస్టర్డ్ పౌడర్ : 3 టేబుల్ స్పూన్లు
* నెయ్యి : 4 టేబుల్ స్పూన్లు
* ఫుడ్ కలర్ : చిటికెడు
* బాదం, పిస్తా, జీడిపప్పు : కొద్దికొద్దిగా
తయారు చేసే విధానం..
* ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కొబ్బరిపాలు, వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు కట్టకుండా కలపాలి.
* తరువాత నాన్ స్టిక్ పాన్ లో నెయ్యి వేసి అది కరిగాక, కొబ్బరిపాల మిశ్రమాన్ని వేసి కలపాలి.
* ఇప్పుడు కొబ్బరి తురుము, బటర్ స్కాచ్ కస్టర్డ్ పౌడర్, ఫుడ్ కలర్ వేసి సుమారు పావుగంట సేపు దగ్గరగా అయ్యేవరకు ఉడికించి దించాలి.
* దించిన మిశ్రమాన్ని చిన్న బౌల్స్ లో సర్దాక బాదం, పిస్తా, జీడిపప్పు ముక్కలు చల్లి వడ్డంచాలి.
టిప్..సాధారణంగా ఇందులో పంచదార అవసరం లేదు. తీపి సరిపోదు అనుకున్న వాళ్లు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







