ఇల్లినాయిస్ నుంచి కృష్ణమూర్తి ...
- July 27, 2016
అమెరికాలో భారత సంతతి వ్యక్తులు అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. శాస్త్రసాంకేతిక, విద్యా రంగాల్లోనే కాకుండా రాజకీయంగాను అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇల్లినాయిస్కు చెందిన డెమోక్రటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తిని.. 'పార్టీ ఎమర్జింగ్ లీడర్'గా ప్రకటించింది.డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ రైజింగ్ స్టార్ లేదా ఎమర్జింగ్ లీడర్లుగా ఇద్దరి పేర్లను ప్రకటించగా అందులో భారత సంతతికి చెందిన కృష్ణమూర్తి ఒకరు కావడం విశేషం. మార్చి 16న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇల్లినాయిస్ నుంచి కృష్ణమూర్తి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతోనే పార్టీ ఆయనకు తగిన గుర్తింపునిచ్చిందని డెమోక్రటిక్ మద్దతుదారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







