హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- December 31, 2025
దోహా: 2025లో ఖతార్ పర్యాటక రంగం ఘనంగా ముగిస్తుంది. హోటల్ రూమ్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో 9.7 మిలియన్లకు చేరుకున్నాయి. 2025 చివరి రోజు సందర్శకుల సంఖ్య దేశ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఖతార్ ఛాంబర్‌లోని పర్యాటక మరియు ప్రదర్శనల కమిటీ సభ్యుడు అయమాన్ అల్ ఖుద్వా తెలిపారు.
జనవరి మరియు నవంబర్ మధ్య సందర్శకుల రాక సుమారు 4.4 మిలియన్లకు చేరుకుందని, డిసెంబర్ లెక్కలు ఇంకా అధికారికంగా విడుదల కావాల్సి ఉందని పేర్కొన్నారు. విజిటర్స్ సంఖ్య మరియు హోటల్ ఆక్యుపెన్సీ పరంగా 2025 సంవత్సరం గతంలోని అన్ని రికార్డులను అధిగమిస్తుందని అల్ ఖుద్వా అన్నారు.
ఈ ఏడాది ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్, ఫిఫా అరబ్ కప్ మరియు అనేక రకాల స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఖతార్ వేదికగా జరిగాయని తెలిపారు. ఏటా ఖతార్ ను సందర్శించే విజిటర్స్ సంఖ్య సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని అయమాన్ అల్ ఖుద్వా వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







