లుసైల్లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!
- January 02, 2026
దోహా: ఖతార్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా లుసైల్ నగరం అందరి దృష్టిని ఆకర్షించింది. లుసైల్ బౌలేవార్డ్ సంవత్సరాంతాన్ని పురస్కరించుకుని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఖతార్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఫైర్ వర్క్స్ ప్రదర్శనతో ఆకాశం వెలిగిపోయింది. 250,000 మందికి పైగా పౌరులు, నివాసితులు ఒక అద్భుతమైన వేడుకతో అధికారికంగా 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
వేడుకలు సాయంత్రం 6:00 గంటలకు అధునాతన లేజర్ లైట్ షోలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు లైవ్ మ్యూజిక్ కాన్సర్టులు కొనసాగాయి. ఒక ప్రత్యేకమైన డ్రోన్ షోలో 46 వేర్వేరు ప్రదేశాల నుండి 1,000 "పైరోడ్రోన్" యూనిట్ల ద్వారా ప్రయోగించిన 4,000 పైరోటెక్నిక్ షాట్లు ప్రదర్శించారు. దీంతోపాటు నిర్వహించిన ఫైర్ వర్క్స్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. భవిష్యత్ నగరంగా లుసైల్ స్థానాన్ని ఇలాంటి కార్యక్రమాలు బలోపేతం చేస్తాయని ఖతారీ దియార్ సీఈఓ షేక్ హమద్ బిన్ తలాల్ అల్-థానీ అన్నారు.
తాజా వార్తలు
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు
- సౌదీ అరేబియాలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష
- కువైట్ లో ఇల్లీగల్ ఫైర్ వర్క్స్ స్టాక్ సీజ్..!!
- ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- లుసైల్లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!
- కోమాలో బాధితుడు.. 25 రోజుల తర్వాత BD25,000 పరిహారం..!!







