లుసైల్‌లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!

- January 02, 2026 , by Maagulf
లుసైల్‌లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!

దోహా: ఖతార్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా లుసైల్ నగరం అందరి దృష్టిని ఆకర్షించింది. లుసైల్ బౌలేవార్డ్ సంవత్సరాంతాన్ని పురస్కరించుకుని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఖతార్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఫైర్ వర్క్స్‌ ప్రదర్శనతో  ఆకాశం వెలిగిపోయింది.  250,000 మందికి పైగా పౌరులు, నివాసితులు ఒక అద్భుతమైన వేడుకతో అధికారికంగా 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
వేడుకలు సాయంత్రం 6:00 గంటలకు అధునాతన లేజర్ లైట్ షోలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు లైవ్ మ్యూజిక్ కాన్సర్టులు కొనసాగాయి. ఒక ప్రత్యేకమైన డ్రోన్ షోలో 46 వేర్వేరు ప్రదేశాల నుండి 1,000 "పైరోడ్రోన్" యూనిట్ల ద్వారా ప్రయోగించిన 4,000 పైరోటెక్నిక్ షాట్లు ప్రదర్శించారు. దీంతోపాటు నిర్వహించిన ఫైర్ వర్క్స్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. భవిష్యత్ నగరంగా లుసైల్ స్థానాన్ని ఇలాంటి కార్యక్రమాలు బలోపేతం చేస్తాయని ఖతారీ దియార్ సీఈఓ షేక్ హమద్ బిన్ తలాల్ అల్-థానీ అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com