ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- January 02, 2026
మస్కట్: ఒమన్ పౌరులందరికీ ప్రీ మారిటల్ వైద్య పరీక్షలను తప్పనిసరి చేశారు. కొత్త నిబంధన జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, వధూవరులలో ఒకరు ఒమాన్ పౌరులు కాకపోయినా, లేదా వివాహం సుల్తానేట్ లోపల లేదా వెలుపల జరిగినా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది.వంశపారంపర్యంగా వచ్చే సికిల్ సెల్ అనీమియా మరియు తలసేమియా, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మరియు హెచ్‌ఐవి/ఎయిడ్స్ వంటి అంటువ్యాధులను నియంత్రించడం ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
వంశపారంపర్య మరియు అంటు వ్యాధులను ముందుగానే గుర్తించడం వల్ల అనారోగ్యంతో పిల్లలు పుట్టడాన్ని తగ్గించవచ్చని, ఇలాంటివి కుటుంబాలపై ఆరోగ్య, సామాజిక, మానసిక మరియు ఆర్థిక భారాలను మోపుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 1999 నుండి ప్రీ మారిటల్ స్క్రీనింగ్ ఐచ్ఛికంగా ఉందని, అయితే 2025లో కేవలం 42 శాతం మంది మాత్రమే ఇందులో పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో కుటుంబ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు ఈ వ్యాధుల నుండి సమాజాన్ని రక్షించడానికి దీనిని తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు
- సౌదీ అరేబియాలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష
- కువైట్ లో ఇల్లీగల్ ఫైర్ వర్క్స్ స్టాక్ సీజ్..!!
- ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- లుసైల్లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!
- కోమాలో బాధితుడు.. 25 రోజుల తర్వాత BD25,000 పరిహారం..!!







