మరోదేశంపై దాడికి సిద్ధంగా ఉన్న ట్రంప్
- January 07, 2026
గత శనివారం తెల్లవారుజామున అమెరికా అకస్మాత్తుగా వెనిజులాపై దాడి చేసి, ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అదుపులో తీసుకుని, పెను రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్నాక అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. వెనిజులా బాధ్యతను తానే నిర్వహిస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. అంతేకాక దక్షిణ అమెరికా దేశాన్ని చక్కదిద్దడమే కర్తవ్యం అన్నారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను పునర్నిర్మించాలని ట్రంప్ పేరొన్నారు. తాజాగా ట్రంప్ మరోదేశాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ ఇరాన్ ను టార్గెట్ చేశారు. అక్కడ అంతర్యుద్ధం జరిగేలా బిగ్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేసేందుకు ప్రణాళిక వేసినట్లు సమాచారం. ఏ క్షణమైనా అమెరికా ఇరాన్ పై దాడులు చేసేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ తో కలిసి ఈ దాడికి ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది.
అదనుకోసం వేచి చూస్తున్న ట్రంప్
ఈ సమయం కోసమే అమెరికా దళాలు ఎదురుచూస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ప్లాన్ ను ఖమేనీ ముందే పసిగట్టారని ఇందుకోసం ఆయన రష్యా పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం అత్యంత సురక్షిత బంకర్ లో ఖమేనీ ఉంటున్నారు. మరోవైపు ఇరాన్ లో ఆర్థిక సంక్షోభం నెలకొనడం, కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో అక్కడి ప్రజలు రోడ్లపై నిరసనలు చేస్తుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటిదాకా జరిగిన ఈ అల్లర్లలో 30 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







