ఖతార్‌లో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు..!!
- January 08, 2026
దోహా: ఖతార్ లో రాబోయో రెండు మూడు రోజులపాటు పొగమంచు అధికంగా ఉంటుందని, అలాగే రాత్రి సమయాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఖతార్ వాతావరణ విభాగం తన వీకెండ్ వాతావరణ నివేదికలో తెలిపింది. జనవరి 8, 9,10 తేదీలలో తెల్లవారుజామున పొగమంచు మరియు మంచు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది.
అలాగే, గంటకు 5–15 నాట్ల వేగంతో చలి గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పొగమంచు కారణంగా కొన్ని ప్రాంతాలలో లో విజిబిలిటీ ఉంటుందని హెచ్చరించింది. ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపింది. ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 17°C నుండి గరిష్టంగా 24°C వరకు ఉంటాయని పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







