ఖతార్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారి వినూత్న ప్రచారం
- July 20, 2015
ఈద్-ఉల్-ఫితర్ మూడురోజుల పర్వదినం సందర్భంగా, ఖతార్ ట్రాఫిక్ శాఖ వారు వాహన వినియోగదారులకు, ముఖ్యంగా పార్కింగు విధానం విషయంలో సున్నితంగా జారీచేసిన హెచ్చరికలు అందరి మన్ననలందుకున్నాయి. ఆస్తవ్యస్తo గా లేదా గుర్తింపులేని ప్రాంతాలలో పార్కింగ్ చేసినవారి వాహనాలపై - "ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, నాగరిక లక్షణం. మీ వాహనం ఉల్లంఘిత ప్రాంతంలో ఉంది. గమనించవలెను. మీకు ఈద్ శుభాకాంక్షలు" అని ఉన్న స్టిక్కర్లను అంటించారు. అంతేకాకుండా వారికి 15,000 ఈద్ గ్రీటింగులను కూడా పంచిపెట్టారు. ఈ శాఖ డైరక్టర్ - బ్రిగడియర్ మొహమ్మద్ సాద్ అల్-ఖర్జీ, నిబంధనలు అతిక్రమించిన వారి వద్దనుండి జరిమానా వసూలు చేయడం తమ ఉద్దేశం కాదని, వారు ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించడం ద్వారా, వారికి ఇంకా ఇతరులకు కూడా భద్రత కల్పించడం తమ లక్ష్యమని తెలిపారు. తమ ఈ వినూత్న ప్రయోగానికి, ప్రజలు, వాహనదారుల నుండి సానుకూల ప్రశంసలు రావడం ఆనందంగా ఉందన్నారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







