యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- January 12, 2026
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అరుదైన ఘనత సాధించారు. పవన్ కళ్యాణ్ పురాతన జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందారు.దీంతో మూడు దశాబ్దాలకు పైగా పవన్ కల్యాణ్ సాగించిన క్రమశిక్షణతో కూడిన శిక్షణ, పరిశోధన, యుద్ధ కళల సంప్రదాయాల పట్ల నిబద్ధతకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది.వివరాలు... ప్రముఖ జపనీస్ సంస్థ సోగో బుడో కన్రి కై నుంచి పవన్ కల్యాణ్ ఫిఫ్త్ డాన్ గౌరవం అందుకున్నారు.ఈ సంస్ష సాంప్రదాయ జపనీస్ యుద్ధ కళలలో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటిగా ఉంది.
అలాగే, సోకే మురమత్సు సెన్సీ నాయకత్వంలోని టకేడా షింగెన్ క్లాన్ లో జపాన్ వెలుపల తెలుగు మాట్లాడే మొదటి వ్యక్తిగా పవన్ కల్యాణ్ స్థానం సంపాదించారు. ఈ గౌరవం జపనీస్ అభ్యాసకులకు తప్ప ఇతరులకు అరుదుగా లభిస్తుంది. అంతేకాదు గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు ‘‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’’ అనే విశిష్ట బిరుదును కూడా ప్రదానం చేసింది.
అయితే తన ఉన్నత శిక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ భారతదేశంలోని ప్రముఖ జపనీస్ యుద్ధ కళల నిపుణులలో ఒకరైన ప్రఖ్యాత బుడో అధికారి హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహమూది వద్ద శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కెండోలో సమగ్ర శిక్షణ పొంది... ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని, తాత్విక పరిజ్ఞానాన్ని సాధించారు. అలాగే, ఈ అరుదైన గౌరవం ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధకళలు, యుద్ధ తత్వశాస్త్రాలను అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్దిమంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇక, పవన్ కళ్యాణ్ సినిమా ల్లోకి ప్రవేశించడానికి చాలా కాలం ముందే మార్షల్ ఆర్ట్స్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. పవన్ కల్యాణ్ చిన్నతనంలో చెన్నైలో ఉన్న సమయంలో కరాటే, సంబంధిత విభాగాలలో ఇంటెన్సివ్ శిక్షణ పొందారు.అలాగే బలమైన సాంకేతిక నైపుణ్యానికి, తాత్విక పరిజ్ఞానానికి పునాదిని అభివృద్ధి చేసుకున్నారు.తర్వాత పవన్ కల్యాణ్ అన్వేషణ శారీరక అభ్యాసానికి పరిమితం కాకుండా, జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయన చేశారు. వాటిని అనేక ఏళ్లుగా పరిశోధించడమే కాకుండా అనుసరించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







