యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

- January 12, 2026 , by Maagulf
యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

దుబాయ్: UAE పద్మశాలి కుటుంబాలు లవ్ లేక్, దుబాయ్ లో సంక్రాంతి వేడుకలను అత్యంత ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో 145 మందికి పైగా సభ్యులు పాల్గొనడంతో పండుగ వాతావరణం సాంస్కృతిక వైభవంతో వెల్లివిరిసింది.

కార్యక్రమంలో జంటల ఆటలు, మహిళల ఆటలు, పిల్లల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా నిర్వహించిన పిల్లల భోగి పళ్ళు కార్యక్రమం తెలుగు సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ అందరి మన్ననలు పొందింది. చిన్నారులు పాల్గొన్న పోస్టర్ మేకింగ్ కార్యక్రమం సంక్రాంతి పండుగ సారాన్ని సృజనాత్మకంగా ప్రతిబింబించింది.

వేడుకలకు మరింత ప్రత్యేకతను చేకూర్చుతూ ATM రెస్టారెంట్, అబుదాబి వారు అందించిన సాంప్రదాయ తెలుగు వంటకాలు పాల్గొన్న వారిని ఆకట్టుకున్నాయి. అలాగే నిర్వహించిన హౌజీ ఆట అందరినీ ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేసి వేడుకల్లో ఉత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకారం అందించిన స్పాన్సర్లను సత్కరించడం, అలాగే సీనియర్ సిటిజన్లను గౌరవించడం జరిగింది. వివిధ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు.

తక్కువ సమయంలోనే వేడుకలను సమర్థవంతంగా నిర్వహించినందుకు హోస్ట్ పవన్ ని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన స్వచ్ఛంద సేవకులు ప్రశంసలకు పాత్రులయ్యారు. ముఖ్యంగా అశోక్ అన్న, లక్ష్మీనారాయణ అన్న నిర్వాహక బృందానికి వెన్నెముకలా నిలిచారు.
అలాగే జగదీశ్, సురేష్, సందీప్, రాజేష్, శ్రీనివాస్, నాగేంద్ర, జన, సతీష్, నరేందర్, ఉమేష్, శిరీష్, కపిల్ల సహకారం విశేషంగా నిలిచింది.

అంతేకాకుండా, ఈ వేడుకల సందర్భంగా UAE పద్మశాలి గ్రూప్ స్థాపక సభ్యులు సదానంద్ అన్న మరియు సుధాకర్ ని కలుసుకోవడం నిర్వాహక బృందానికి మరింత ఉత్సాహాన్ని అందించింది.

మొత్తంగా, ఈ సంక్రాంతి వేడుకలు సామాజిక ఐక్యతను, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విజయవంతంగా ముగిశాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com