అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!

- January 14, 2026 , by Maagulf
అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!

యూఏఈః అబుదాబి మరియు దుబాయ్ మధ్య ప్రతిరోజూ ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్. ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెడుతూ E11 హైవేపై కొత్తగా EV మెగాహబ్ ను ప్రారంభించినట్లు ADNOC డిస్ట్రిబ్యూషన్ తెలిపింది. యూఏఈ  అత్యంత రద్దీగా ఉండే ఇంటర్-ఎమిరేట్ కారిడార్లలో ఒకటైన సైహ్ షుయబ్ వద్ద ఉన్న ఈ సైట్ 60 సూపర్‌ఫాస్ట్ ఛార్జర్‌లను ఒకేసారి అందుబాటులోకి తీసుకురానున్నారు.  ఒక సాధారణ స్టేషన్‌లో ఐదు లేదా ఆరు ఛార్జర్‌లు ఉంటాయని, ఇక్కడ మాత్రం ఒకేసారి 60 సూపర్ ఫాస్ట్ ఛార్జర్లను ఏర్పాటు చేసినట్లు అడ్నాక్ డిస్ట్రిబ్యూషన్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జాక్వెలిన్ ఎల్బోగ్దాది తెలిపారు.
అయితే, ఈ వారం హబ్ ను అధికారికంగా ప్రారంభించబడినప్పటికీ, ఇది డిసెంబర్ నుండి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. సయి షుయబ్ స్థానానికి నేరుగా ఎదురుగా ఉన్న ఘాంటౌట్‌లో రెండవ EV హబ్‌ను తెరవాలని కంపెనీ యోచిస్తోందని, ఇది అబుదాబి-దుబాయ్ హైవేలో  ప్రయాణానికి రెండు వైపులా కవర్ చేయడానికి ఉపయోగపడుతుందని ఎల్బోగ్దాది వివరించారు. వాహనాలకు పూర్తిగా ఛార్జ్ చేయడానికి 20 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com