1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- January 14, 2026
కువైట్ః 2025లో 1,197 మందికి పైగా ప్రవాసులను కువైట్ బహిష్కరించింది. మాదకద్రవ్య సంబంధిత కేసులలో వారు పాల్గొన్నారని నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కబజార్డ్ తెలిపారు. కువైట్ కెమికల్ సొసైటీ నిర్వహించిన సెమినార్‌లో ఆయన పాల్గొన్నారు. 2025లో మాదకద్రవ్యాల వ్యాప్తిని, ముఖ్యంగా సింథటిక్ పదార్థాలను నియంత్రణకు తీసుకొచ్చిన కొత్త చట్టం గురించి వివరించారు.
2025లో అధికారులు 3,039 మాదకద్రవ్య కేసులను నమోదు చేసి 3,871 మంది అనుమానితులను అరెస్టు చేశారని తెలిపారు. వారందరినీ డ్రగ్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు ఆయన వెల్లడించారు. పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిలో దాదాపు మూడు టన్నుల మాదకద్రవ్యాలు మరియు దాదాపు 10 మిలియన్ సైకోట్రోపిక్ మాత్రలు ఉన్నాయని అన్నారు. కువైట్ మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణా మరియు పంపిణీలో అధునాతన పద్ధతులను ఉపయోగించే వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌లను ఎదుర్కొంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







