హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- January 14, 2026
దోహా: ఖతార్ కస్టమ్స్ 'షాబు' అని పిలిచే మాదకద్రవ్య పదార్థమైన మెథాంఫెటమైన్‌ను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఒక షిప్‌మెంట్‌లో దాచిపెట్టిన 1.84 కిలోగ్రాములను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ అనుమానం వచ్చిన తర్వాత ఈ స్మగ్లింగ్ గుట్టు బయటపడింది. హమద్ పోర్టు ద్వారా వస్తున్న షిప్‌మెంట్‌లలో ఒకదానిలో ఆడియో స్పీకర్ల బోలు కంపార్ట్‌మెంట్లలో మాదకద్రవ్య పదార్థం దాచినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మాదకద్రవ్యాల మొత్తం బరువు 1.84 కిలోలని కస్టమ్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







