ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక

- January 15, 2026 , by Maagulf
ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
దుబాయ్: పిల్లలు, టీనేజర్లు పాల్గొంటున్న కొన్ని ప్రమాదకర “ఛాలెంజ్లు” ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) తల్లిదండ్రులను హెచ్చరించింది. ఈ విషయమై ఇటీవల దుబాయ్లోని స్కూల్లు, తల్లిదండ్రులకు అధికారిక సర్క్యులర్ పంపింది.
ఈ హెచ్చరికలు KHDA సహకారంతో నిర్వహించబోయే ఆన్లైన్ పేరెంట్స్ అవగాహన కార్యక్రమం నేపథ్యంలో వచ్చాయి. పిల్లల భద్రతలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమని అధికారులు తెలిపారు.
 
ఏలాంటి ప్రవర్తనలు ప్రమాదకరం?
DHA ప్రకారం, కొందరు విద్యార్థులు ఈ విధమైన ప్రమాదకర చర్యల్లో పాల్గొంటున్నారు:
శ్వాస ఆపుకోవడం లేదా గొంతు నొక్కడం
మెడ లేదా తలపై ఒత్తిడి పెట్టడం
ప్రమాదకర ఛాలెంజ్లను ప్రయత్నించడం
సోషల్ మీడియా ట్రెండ్స్ను అనుకరించడం
 
ఇవి ఎందుకు ప్రమాదకరం?
ఈ చర్యలు “ఆటలు” కాదని, వైద్యపరంగా చాలా ప్రమాదకరమైనవి అని ఆరోగ్య అధికారులు స్పష్టం చేశారు. శ్వాస లేదా మెదడుకు రక్త ప్రవాహం ఆగితే:
కొన్ని సెకన్లలోనే మెదడు దెబ్బతినే అవకాశం
అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం
ఫిట్స్ రావడం
గుండె ఆగిపోవడం
అంతర్గత గాయాలు
మరణం కూడా సంభవించవచ్చు
 
👉 ఇలాంటి పనులకు సురక్షితమైన మార్గం ఏదీ లేదు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పిల్లలు ఎందుకు ఇలాంటి పనులవైపు ఆకర్షితులవుతున్నారు?
స్నేహితుల ఒత్తిడి
ఆసక్తి, ఉత్సుకత
సోషల్ మీడియా ట్రెండ్స్
కొత్త అనుభవాల కోసం ప్రయత్నించడం
ఈ కారణాల వల్ల ముఖ్యంగా ప్రీ-టీన్స్, టీనేజర్లు ప్రమాదకర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని DHA తెలిపింది.
 
తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు
శారీరక లక్షణాలు:
మెడ వద్ద గాయాలు, ఎర్రదనం
తలనొప్పి, తల తిరగడం
స్పృహ కోల్పోవడం
కళ్లలో ఎర్రదనం
ప్రవర్తనలో మార్పులు:
గోప్యంగా మొబైల్ వాడడం 
“ఛాలెంజ్లు” గురించి మాట్లాడటం
ప్రవర్తన లో మార్పులు 
మెడ కప్పే దుస్తులు ఎక్కువగా ధరించడం
 
తల్లిదండ్రులు ఏమి చేయాలి?
పిల్లలతో ప్రశాంతంగా, స్పష్టంగా మాట్లాడాలి
ఇవి ఆటలు కాదని గట్టిగా చెప్పాలి
ఆన్లైన్ కంటెంట్ను గమనించాలి
ఒత్తిడికి “నో” చెప్పడం నేర్పాలి
అనుమానం ఉంటే పెద్దలకు చెప్పాలని ప్రోత్సహించాలి
 
స్కూల్లు కూడా అప్రమత్తం
దుబాయ్లోని స్కూల్లు పిల్లల భద్రత కోసం ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. హోం–స్కూల్ భాగస్వామ్యం ఉంటేనే ఇలాంటి సమస్యలను ముందే గుర్తించవచ్చని స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి.
 
నిపుణుల మాట
చైల్డ్ ప్రొటెక్షన్ నిపుణురాలు క్లేర్ స్కోవెన్ మాట్లాడుతూ,
“పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు, స్కూల్లు కలిసి పనిచేయాలి. ఇంట్లో కనిపించే చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకూడదు” అన్నారు.
అమెరికన్ అకాడమీ ఫర్ గర్ల్స్ ప్రిన్సిపల్ లిసా జాన్సన్ మాట్లాడుతూ,“పిల్లలతో దీర్ఘకాలిక అనుబంధం ఉంటే వారి ప్రవర్తనలో మార్పులను త్వరగా గుర్తించవచ్చు” అని తెలిపారు.
 
క్రెడెన్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ దీపిక థాపర్ సింగ్ మాట్లాడుతూ,“పిల్లలు భయపడకుండా మాట్లాడేలా సురక్షిత వాతావరణం స్కూల్లలో ఉండాలి” అన్నారు.
 
సందేశం ఒక్కటే
👉 పిల్లల భద్రత ఇంటి నుంచే మొదలవుతుంది.
సమయానికి మాట్లాడితే, గమనిస్తే, ప్రమాదాలను ముందే నివారించవచ్చు.
 
--బాజీ షేక్(యూఏఈ)
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com