త్వరలో 11 మున్సిపాలిటీల్లో ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లు

- July 28, 2016 , by Maagulf
త్వరలో 11 మున్సిపాలిటీల్లో ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్లు

రాష్ట్రంలోని 11 మున్సిపాలిటీల్లో త్వరలో అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం ఆయన అధికారులతో జరిపిన సమీక్షలో మాట్లాడుతూ... అమరావతిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ విజయవంతమైందన్నారు. దీన్ని మోడల్‌గా తీసుకుని రాష్ట్రంలో 11 మున్సిపాలిటీల్లో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రజా సేవలు అన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరిచి విస్తృతంగా సమర్ధవంతంగా, పారదర్శకంగా, వేగంగా అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే గృహ నిర్మాణ పథకాలకు శ్రీకారం చుట్టాలని, రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లను అభివృద్ధి చేస్తామన్నారు. 11 మునిసిపాలిటీల అధికారులకు కృష్ణా పుష్కరాల విధుల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com