కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..
- January 17, 2026
అమెరికా: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్‌కు అమెరికాలోని కాన్సాస్‌లో అరుదైన గౌరవం దక్కింది. కాన్సాస్ రాష్ట్ర సెనేట్ సభ్యులను ఆశీర్వదించి ప్రసంగించారు కేఏ పాల్.
ప్రపంచంలో జరుగుతున్న 58 యుద్ధాలను ఆపాలంటూ అమెరికా నాయకులకు కేఏ పాల్ పిలుపునిచ్చారు. వెనెజువెలా, యుక్రెయిన్, గాజా, ఇజ్రాయెల్, ఇరాన్‌లో శాంతి కోసం ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రపంచంలో అత్యధిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దేశంగా అమెరికాను ప్రశంసించారు. చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ ముప్పును ఎదుర్కొనేందుకు భారత్-అమెరికా కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
అఫ్ఘానిస్థాన్, ఇరాన్ యుద్ధాలు అమెరికాకు నష్టం కలిగించాయని డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల నేతలు అంగీకరించారు. అంతకుముందు రిపబ్లికన్, డెమోక్రట్ నేతలు నిలబడి చప్పట్లతో కేఏ పాల్‌కు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు







