కింగ్ ఫహద్ రోడ్డులో వారం రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- August 08, 2026
కువైట్ : కింగ్ ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ రోడ్డు (రోడ్ నంబర్ 40) ను పాక్షికంగా మూసివేయనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రకటించింది. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఆగస్టు 8 నుంచి వారం రోజులపాటు అమల్లో ఉంటాయని పేర్కొన్నది.
కింగ్ ఫహద్ రోడ్డులోని కుడివైపు రెండు లేన్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. అలాగే బయాన్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ రోడ్ (ఫిఫ్త్ రింగ్ రోడ్) వైపు వెళ్లే బ్రాంచ్ ఎంట్రన్స్‌ను కూడా మూసివేయనున్నారు.
మూసివేత సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు. రహదారిపై ఏర్పాటు చేసే ట్రాఫిక్ సూచనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.
ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఈ మార్పుల కారణంగా ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కింగ్ ఫహద్ రోడ్డును ఉపయోగించే వాహనదారులు ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







