బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!

- January 17, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!

మనామా: బహ్రెయిన్ లో చలిగాలుల తీవ్రత ప్రారంభమైంది. శనివారం ఉదయం  పలు ప్రాంతాలలో తక్కువ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కింగ్ ఫాహ్ద్ కాజ్‌వే వాస్తవ ఉష్ణోగ్రత 11°C నమోదు కాగా, గాలి మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రత 6°Cకి పడిపోయింది. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉష్ణోగ్రత 13°C వద్ద ఉండగా, ఉదయం 7°C గా నమోదైంది. 

సిత్రాలో వాస్తవ ఉష్ణోగ్రత 12°C కాగా, నివాసితులు 9°Cకి దగ్గరగా ఉన్న చల్లని వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. ఇక్క 11°C నమోదు కాగా, ఉదయం 5°C గా రికార్డు అయింది.

బహ్రెయిన్ విశ్వవిద్యాలయం మరియు రషీద్ ఈక్వెస్ట్రియన్ & హార్స్ రేసింగ్ క్లబ్‌లో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. అక్కడ వాస్తవ ఉష్ణోగ్రతలు 11°C అయితే, ఉదయం చల్లని గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు 7°C మరియు 8°C మధ్య రికార్డు అయ్యాయి.

ఉదయం వేళల్లో చల్లని గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని,  ముఖ్యంగా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com