దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!

- January 17, 2026 , by Maagulf
దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!

యూఏఈ: డిస్కవరీ గార్డెన్స్‌లో పెయిడ్ పార్కింగ్ ప్రారంభమైంది.  ఇంటర్నేషనల్ సిటీలో ఫిబ్రవరి 1నుండి పెయిడ్ పార్కింగ్ అమలులోకి వస్తుంది.ఈ రెండు ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుండి అర్ధరాత్రి వరకు పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఆదివారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాలలో పార్కింగ్ ఉచితమని ప్రకటించారు.

కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి నివాస యూనిట్‌కు ఒక ఉచిత పార్కింగ్ పర్మిట్ లభిస్తుంది.  కానీ అదనపు కార్లు లేదా ఎక్కువసేపు పార్క్ చేస్తే రుసుములు వర్తిస్తాయని తెలిపింది. డిస్కవరీ గార్డెన్స్‌లో ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు గంటకు Dh4 మరియు సాయంత్రం 5 నుండి అర్ధరాత్రి వరకు గంటకు Dh6 చొప్పున రేట్లు అమల్లో ఉంటాయి.   

ఇంటర్నేషనల్ సిటీలో మాత్రం నగరం అంతటా అమల్లో ఉన్న ప్రామాణిక పార్కిన్ టారిఫ్ వ్యవస్థ అమలు చేయనున్నారు. ఇక్కడ పార్కింగ్ 30 నిమిషాలకు Dh2, ఒక గంటకు Dh3 నుండి ప్రారంభమై, ఎక్కువసేపు పార్క్ చేస్తే Dh25 వరకు ఉంటుంది.

డిస్కవరీ గార్డెన్‌లో ఒక నివాసి ప్రతి సాయంత్రం నాలుగు గంటల పాటు Dh6 చొప్పున పార్క్ చేస్తే, అంటే రోజుకు సుమారు Dh24, లేదా 20 పనిదినాలు ఉన్న నెలలో సుమారు Dh480 అదనపు ఖర్చు అవుతుంది. చాలా మంది నివాసితులు దీనిని తమ సాధారణ ఖర్చులకు అదనంగా నెలవారీ ఖర్చుగా భావిస్తున్నారు.

 

కొంతమంది నివాసితులు ఇప్పటికే తమ డైలీ వర్క్ షెడ్యూల్ ను మార్చుకుంటున్నారు. అల్ క్వోజ్‌లో పనిచేస్తూ ఇంటర్నేషనల్ సిటీలో నివసిస్తున్న అహ్మద్ రజా.. గంటవారీ ఛార్జీలను నివారించడానికి తన కార్యాలయ సమయాలను మార్చుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపాడు. 

డిస్కవరీ గార్డెన్స్‌లో సనా ముంతాజ్ Dh6 పార్కింగ్ బిల్లులు చెల్లించకుండా ఉండటానికి ఇప్పుడు సాయంత్రం షాపింగ్ మరియు జిమ్ సందర్శనలను ఒకే ట్రిప్‌లో పూర్తి చేస్తున్నానని తెలిపారు.  అలాగే, నివాసితులు అదనపు కార్ల గురించి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. తన కుటుంబం ఇప్పుడు ప్రతిరోజూ ఒక కారును ఉపయోగించడం మరియు అవసరమైనప్పుడు మాత్రమే రెండవ కారును పార్క్ చేయడంపై దృష్టి పెడుతున్నట్లు ఇంటర్నేషనల్ సిటీలో ఇంజనీర్ అయిన అవాయిస్ అహ్మద్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com