మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- January 17, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని హఫర్ అల్ బాటిన్లో ఒక హత్య జరిగిందని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై సౌదీ అరేబియా అధికారులు క్లారిటీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో ఒక ప్రకటన జారీ చేశారు. సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తూర్పు ప్రాంత పోలీసుల మీడియా ప్రతినిధి ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న వీడియో నిజం కాదు అని తెలిపారు.
ఈ సంఘటన కుటుంబ కలహాలకు సంబంధించినదని, దానిని పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు కూడా వారు తెలిపారు. వీడియోను రికార్డ్ చేసి పోస్ట్ చేసిన వ్యక్తిని కూడా సైబర్ నేరాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు అరెస్టు చేసినట్ట తెలిపారు. సైబర్ నేరాల నిరోధక చట్టం ప్రకారం, ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష మరియు/లేదా 3 మిలియన్ల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు.. కాచిగూడ రైల్వే స్టేషన్ టార్గెట్‌గా మెయిల్
- కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!
- ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!!
- అవయవ మార్పిడి చికిత్సల్లో కింగ్ ఫైసల్ హాస్పిటల్ అరుదైన ఘనత..!!
- ఖతార్‌లో రెండో దశ ఎలక్ట్రిక్ రోబోటాక్సీల ట్రయల్స్..!!
- యూఎన్ ఆరోపణలను ఖండించిన బహ్రెయిన్..!!
- యూఏఈలో ఆన్లైన్ సెల్లర్స్ కు కొత్త రూల్స్..!!
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్







