గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- January 18, 2026
హైదరాబాద్: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసిన గ్రీన్ కో సంస్థపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రశంసల వర్షం కురిపించారు. గ్రీన్ కో సంస్థకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.ఈ ప్రాజెక్ట్ వివరాలను ఆయన ప్రస్తావిస్తూ, "1950 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ సామర్థ్యంతో, 1.5 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటైన ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్.. భారతదేశ ఇంధన రంగ పరివర్తనలో, అధిక విలువైన రసాయనాల ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది" అని పేర్కొన్నారు.ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన, భారీ ప్రాజెక్టులే దేశ ఆర్థిక వ్యవస్థను మార్చగలవని జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’







