సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- January 18, 2026
అమరావతి: సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడకు పాల్పడుతున్నారు. ‘‘ఫోన్‌పే లింక్ క్లిక్ చేస్తే రూ.5,000 మీ ఖాతాలో పడతాయి’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి.మొదట నమ్మలేదని, కానీ నిజంగానే డబ్బులు వచ్చాయని చెప్పేలా మెసేజ్‌లు ఉండటంతో చాలామంది మోసపోయే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహా లింకులు పూర్తిగా నకిలీవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ ఆఫర్లు వచ్చాయని ఆసక్తితో లింక్‌ను ఓపెన్ చేస్తే మొబైల్‌లోకి మాల్వేర్ చొరబడుతుంది. ఫోన్లో ఉన్న ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లి, క్షణాల్లో ఖాతాలు ఖాళీ అవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పండగ వేళ ఎవరూ ఉచితంగా డబ్బులు పంచరని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌లు ఎప్పటికీ లింక్‌ల ద్వారా డబ్బులు ఆఫర్ చేయవని, అలాంటి సందేశాలు వస్తే వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’







