నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు

- January 18, 2026 , by Maagulf
నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు

ప్రముఖ సీనియర్ నటి శారదకు మరో అరుదైన, ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన జేసీ డేనియల్ అవార్డు–2024కు ఆమెను ఎంపిక చేసినట్లు కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మలయాళ చిత్ర పరిశ్రమకు శారద చేసిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా కేరళ ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. జేసీ డేనియల్ అవార్డు కేరళ సినిమా రంగంలో జీవితకాల సేవలకు అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం ఇది. ఈ అవార్డు కింద శారదకు రూ.5 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేస్తారు.

ఆమె అసలు పేరు సరస్వతీ దేవి. తెలుగులో ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంతో నటిగా అడుగుపెట్టి, తన పేరును శారదగా మార్చుకున్నారు. 1965లో ‘ఇణప్రావుకళ్ణ చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి ప్రవేశించారు. ‘తులాభారం’ (1968), అదూర్‌ గోపాలకృష్ణన్‌ దర్శకత్వం వహించిన ‘స్వయంవరం’ (1972) చిత్రాలకుగాను జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకున్నారు. తెలుగు చిత్రం ‘నిమజ్జనం’ (1977)తో మూడోసారి జాతీయ ఉత్తమ నటిగా నిలిచారు.

‘మురప్పెన్ను’, ‘త్రివేణి’, ‘మూలధనం’, ‘ఇరుట్టింతె ఆత్మావు’, ‘ఎలిప్పతాయం’, ‘ఒరు మిన్నామినుంగింటె నురుంగువెట్టం’, ‘రాప్పకల్ణ వంటి ఎన్నో మరపురాని చిత్రాలలో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 125కు పైగా మలయాళ చిత్రాలలో నటించి, అక్కడి ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. ఇలాంటి గొప్ప నటికి రాష్ట్ర అత్యున్నత సినీ పురస్కారం అందించడం సముచితమని జ్యూరీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com