దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- January 18, 2026
దుబాయ్: దుబాయ్‌లోని ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యులు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ చేసిన సేవలు తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని తెలిపారు. రాజకీయాలతో పాటు కళారంగంలోనూ అపూర్వమైన ఖ్యాతిని సాధించిన ఎన్టీఆర్, తెలుగు ప్రజల్లో ఆత్మగౌరవ భావనను రగిలించిన మహానేత అని కొనియాడారు.
అలాగే పేదల సంక్షేమం, మహిళల అభ్యున్నతి, గ్రామీణాభివృద్ధి కోసం ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు.ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని ఈ సందర్భంగా సభ్యులు సంకల్పం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో దుబాయ్‌లో నివసిస్తున్న పలువురు ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







