భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- January 19, 2026
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానం మేరకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈరోజు (జనవరి 19) భారతదేశానికి అధికారిక పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ప్రధాన మంత్రి మోడీ యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలికారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. భారత్లో యూఏఈ అధ్యక్షుడి పర్యటన కేవలం రెండు గంటలకు పైగా మాత్రమే జరగనున్నట్లు సమాచారం. యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షేక్ మొహమ్మద్ భారతదేశానికి అధికారికంగా రావడం ఇది మూడవసారి, మొత్తంగా ఆయనకు ఇది ఐదవ పర్యటన కానుంది. ఈ పర్యటన భారతదేశం- యూఏఈ సంబంధాలలో మరో మైలురాయిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై ఉమ్మడి ప్రయోజనాల కోసం ఈ ఇద్దరు నాయకులు కొత్త మార్గాన్ని రూపొందించనున్నారు. భారతదేశం – యూఏఈ మధ్య సంబంధం కేవలం వాణిజ్యానికే పరిమితం కాలేదు. ఇటీవలి సంవత్సరాలలోఈ రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సంబంధాలు పెరిగాయి. సెప్టెంబర్ 2024లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఏప్రిల్ 2025లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భారతదేశాన్ని సందర్శించడం ఈ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది. నేటి సందర్శన ఆ చొరవలో భాగం అని, ఇది రక్షణ, సాంకేతికత వంటి రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తు్న్నారు. ఈ పర్యటన ఇంధన భద్రత, ముఖ్యంగా దీర్ఘకాలిక చమురు సరఫరాలు, పునరుత్పాదక శక్తిలో కొత్త కోణాలను స్థాపించడంపై దృష్టి పెడుతుందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!







