'తానా' అధ్యక్షులు శ్రీ సతీష్ వేమన గారికి అభినందన సభ
- July 20, 2015

దుబాయ్ లోని తెలుగు ప్రముఖులు శ్రీ ఎల్.అజిత్ కుమార్ గారు మరియు రసమయి తెలుగు అసోసియెషన్, దుబాయ్ వారి సహకారంతో, TANA అధ్యక్షులు శ్రీ సతీష్ వేమన గారికి అభినందన సభ ఏర్పాటుచేశారు. ఇక్కడి ప్రముఖ వ్యాపారవేత్తలు, సాంకేతిక మరియు ఐ. టి. నిపుణులు ఈ సభలో పాల్గొని సాంస్కృతిక అవగాహన పెంపొందించేందుకు,ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు NRI లకు సహాయపడేందుకు అవసరమైన చర్యలను గూర్చి వారి విలువైన అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్తులో తెలుగు సంస్కృతి వైభవాన్ని వ్యాప్తిచేసేందుకు రెండు సంఘాలు కలసి పనిచేయాలనే రసమయి జనరల్ సెక్రటరీ శ్రీమతి కృష్ణవేణి పంతాల గారి ఆలోచనను అందరు హర్షించారు. ఈవిధమైన దిగ్గజాల కలయిక, అంతర్జాతీయంగా మంచి విలువైన కార్యక్రమాలను చేపట్టగలవని, తెలుగువారి స్థాయిని పెంచగలవని రసమయి అధ్యక్షులు శ్రీ రాజు పొట్రు గారు వాకృచ్చారు.
--సి.శ్రీ(దుబాయ్)

తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







