'హాథీరామ్ బాబా' గా నాగ్
- July 20, 2015
సోగ్గాడే చిన్నినాయన చిత్రం షూటింగ్ ను రీసెంట్ గా పూర్తి చేసిన నాగార్జున... ప్రస్తుతం కార్తీక్ తో కలసి నటిస్తున్న మల్టీస్టారర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తికాకముందే... నాగార్జున హీరోగా మరో సినిమా ప్రారంభమవబోతోంది. కొన్నాళ్లుగా వినిపిస్తున్న నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్ అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోందట. వీరిద్దరి కలయికలో మరోసారి భక్తిరస చిత్రం తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే.. మరోసారి వేంకటేశ్వరస్వామి భక్తుడిగా నటించబోతున్నాడట నాగార్జున. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీమంజునాథ, పాండురంగడు, శిరిడీసాయి వంటి భక్తిరస చిత్రాలలో అలరించిన రాఘవేంద్రరావు.. ఇప్పుడు మరోసారి నాగ్ ప్రధానపాత్రలో పూర్తిస్థాయి భక్తిరస చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రాఘవేంద్రుడి దర్శకత్వంలో అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తుల పాత్రలు పోషించిన నాగార్జున.. ఇప్పుడు వేంకటేశ్వరుడి మరో భక్తుడు హాథీరామ్ బాబాగా నటించబోతున్నాడట. తిరుమలేశుని భక్తుడైన హాథీరామ్ బాబా పేరిట.. తిరుమలలో ఓ మఠం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్ గా వ్యవహరిస్తున్న రాఘవేంద్రరావు.. హాథీరామ్ పై పూర్తిస్థాయి భక్తిరస చిత్రం తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారట. రచయిత జె.కె.భారవి సారథ్యంలో ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కీరవాణి, సినిమాటోగ్రాఫర్ గా యస్.గోపాల్ రెడ్డి వ్యవహరించనున్నారు. మరి మరోసారి భక్తిరస చిత్రంతో రాబోతున్న నాగ్-రాఘవేంద్రరావు కాంబినేసన్.. ఈ సారి ఏ రీతిన మెప్పిస్తారో చూడాలి..!
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







