ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- January 22, 2026
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు చెందిన మరో కీలక నేతకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి సిట్ ఈ నెల 20న హరీశ్ రావును పిలిపించి విచారించింది. సుమారు 7 గంటల పాటు హరీశ్ రావును సిట్ విచారించింది. అవసరం అయితే మళ్లీ పిలుస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు.
ఇప్పుడు తాజాగా కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది సిట్. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్లలో ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఆయన నివాసానికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది.
కేటీఆర్ కి సిట్ నోటీసులు నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు తెలంగాణ భవన్ కి రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకి కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణ భవన్ లోనే ఉండి హరీశ్ రావు మానిటరింగ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







